BREAKING
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు.. ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం

నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి

Select Suryaa Now
నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి

 అనపర్తి మేజర్ న్యూస్. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందిస్తూ రాంబాబు యువసేన చేస్తున్న సేవలు చాలా అమూల్యమైనవని, వారు చేస్తున్న సేవలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. రక్తదానాన్ని నిరంతర సేవా కార్యక్రమంగా కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న రాంబాబు యువసేన సభ్యులను ఆయన అభినందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) జన్మదిన వేడుకలు శనివారం అనపర్తిలోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

 ఈ సందర్భంగా రాంబాబు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16వ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంబాబు యువసేన ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, సభ్యులు స్వయంగా రక్తదానం చేయడంతో పాటు వందలాది మందిని రక్తదానం చేసేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. స్వార్థానికి దూరంగా సమాజ శ్రేయస్సు కోసం తమ సమయం, శ్రమను కేటాయిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు

.కేవలం రక్తదాన శిబిరాల నిర్వహణకే పరిమితం కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తాన్ని అందించేందుకు ‘అనపర్తి బ్లడ్ డోనర్స్’ యాప్‌ను రూపొందించడం ప్రత్యేకంగా అభినందించదగిన విషయమన్నారు. ఈ యాప్ ద్వారా రక్తదాతలను అందుబాటులో ఉంచి అవసరమైన సమయంలో రక్తాన్ని అందించడం ద్వారా రాంబాబు యువసేన నిరంతర సేవలను కొనసాగిస్తోందని తెలిపారు. జన్మదినాలు, వివాహ వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలను ఆర్భాటాలకు పరిమితం చేయకుండా రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా కలిగే మానసిక ఆనందం వెలకట్టలేనిదన్నారు.తమ ఆధ్వర్యంలో నిర్వహించిన 16 రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 3,800కు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. అలాగే ‘అనపర్తి బ్లడ్ డోనర్స్’ యాప్‌లో సుమారు 2,000 మంది రక్తదాతలు నమోదు చేసుకున్నారని, అవసరాన్ని బట్టి వారు నిరంతరం రక్తదానం చేస్తున్నారని చెప్పారు. యాప్ ద్వారా ఇప్పటివరకు 4,600కు పైగా యూనిట్ల రక్తాన్ని దాతలు అందించినట్లు వివరించారు.

శనివారం నిర్వహించిన 16వ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. రాజమండ్రికి చెందిన సంజీవని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు శిబిరంలో రక్తాన్ని సేకరించారు.ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిని, శిబిర నిర్వహణకు సహకరించిన సంజీవని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ప్రకాష్‌ను రాంబాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, అనపర్తి టౌన్ అధ్యక్షులు నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి (బాబ్జి), మాజీ జడ్పీటీసీలు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు), సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ వార కుమారి, పాలమూరు మాజీ ఉపసర్పంచ్ సత్తి సూరారెడ్డి, కొప్పవరం మాజీ సర్పంచ్ తాడి సూరారెడ్డి, బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షులు పోతుల ప్రసాదరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి (మిలట్రీరెడ్డి), మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కర్రి దాసు, మహేంద్రవాడ గ్రామ ఉపసర్పంచ్ మల్లిడి గంగరాజు, కుతుకులూరు మాజీ ఉపసర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.