BREAKING
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు.. ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం

81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం

Select Suryaa Now
81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం

రాయవరం మేజర్ న్యూస్. :  రాయవరం మండలం, కూర్మాపురం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్  ఉన్నత పాఠశాలలో "మనబడి - మన భవిష్యత్" (ఫేజ్-2) కార్యక్రమంలో భాగంగా రూ.81.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు , మాజీ ఎమ్మెల్సీ వి.వి.వి. చౌదరితో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం, స్థానిక రామాలయం వద్ద మండల నిధులు రూ.4.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన షెడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మతికుమిల్లి ఉదయభాస్కరరావు, గుణం పనసయ్య, రాయుడు సురేష్, కాకి లోవరాజు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యా కమిటీలు, నీటి సంఘం సభ్యులు, సొసైటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు