BREAKING
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు.. ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

Select Suryaa Now
 మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి.

మండపేట మేజర్ న్యూస్ :  మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ సూచించారు. నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్‌ 2047  సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండపేటలోని వైష్ణవి ఒకేషనల్‌, ఐటీఐ, నర్సింగ్‌ కళాశాలల వద్ద నషా ముక్త్‌ భారత్‌ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కరస్పాండెంట్‌ కోనే వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.  చుట్టుపక్కల ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసలైతే వారికి అవగాహన కల్పించి, మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. బాధితులకు కౌన్సెలింగ్‌, వైద్య చికిత్స, పునరావాస కేంద్రాల ద్వారా సహాయం అందించాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. నషా ముక్త్‌  భారత్‌  అభియాన్ దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. తాము కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా భాగస్వాములమవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు పందిరి వీర్రాజు,  బీజేపీ ప్రధాన కార్యదర్శి కోటిపల్లి కృష్ణమాచార్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు మల్లువలస రాజశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.