రూరల్ అభివృద్ధే మా లక్ష్యం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధే తమ జెండా, అజెండా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి వాటికి అనుగుణంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచుతున్న నమ్మకమే మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలు వేసే ప్రతి ఓటు తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, కో క్లస్టర్ ఇంచార్జ్ కుంచనపల్లి శివకుమార్, కలివెలపాలెం పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు వేడిచెర్ల వెంకటేశ్వర్లు యాదవ్, చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి, కామయ్య, అత్తులూరు ఈశ్వరయ్య, కువ్వాకుల శ్యామయ్య, వై.శ్రీనివాసులు రెడ్డి, ఎన్.సురేందర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, వెడిచర్ల శ్రీనివాసులు యాదవ్, వెడిచర్ల హజరత్ యాదవ్, పోతయ్య, బి.కిషోర్ నాయుడు, కె.శివప్రసాద్, డేగ సేనయ్య, కువ్వాకుల వెంకటరమణయ్య, ఆమూలూరు శ్రీనివాసులు, రావుల మధుబాబు, జడ రాజేష్, రవి, లక్ష్మణ్, దాసరి వెంకట శేషయ్య, ఉడత విజయ్, రాజశేఖర్, పి.భాస్కర్, డేగా సీనియ్య, మేకల క్రిష్ట్రయ్య, శ్రీనయ్య రావుల, కేశవ్ రావుల, నల్లయ్య, ఈపూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.