BREAKING
జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి మిట్నాల గ్రామంలో విషాదం -వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి మృతి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం ఎమ్మెల్సీ ఓటే ఆయుధం....పేర్లు నమోదు చేసుకోండి 81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి బీసీల ద్రోహి జగన్.

ఎయిర్‌పోర్టు నిర్వాసితుల నిరసన. హామీల అమలుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన.

Select Suryaa Now
ఎయిర్‌పోర్టు నిర్వాసితుల నిరసన.  హామీల అమలుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన.

గన్నవరం, అక్టోబర్ 3, మేజర్ న్యూస్, ప్రతినిధి, (గుర్రం ప్రసాద్).

గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన శనివారానికి ఆరో రోజుకు చేరింది. 2013 భూసేకరణ చట్టం, 2020లో జారీ చేసిన జీవో ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సీపీఎం, సీపీఐ నాయకులు నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చిన చిన్న, సన్నకారు రైతులకు 11 ఏళ్లుగా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. సుమారు 800 ఎకరాల భూములు తీసుకున్నప్పటికీ బాధితుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నిర్వాసితులకు రావాల్సిన పరిహారం సుమారు రూ.120 కోట్ల వరకు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఎయిర్‌పోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆమె విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెంటనే నిర్వాసితుల వద్దకు వచ్చి వారి సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద గతంలో నిరసన తెలిపిన నిర్వాసితులను అరెస్టు చేయడం సరికాదన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.