ఆ ఎన్నారై వైపే వైసీపీ చూపు...
డోన్ రూరల్ మేజర్ న్యూస్..
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డోన్ మున్సిపల్ ఎన్నికల లో చైర్మన్ అభ్యర్థి ఎంపిక పై రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మాజీ మంత్రి బుగ్గన
డోన్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నేపథ్యంలోనే చైర్మన్ అభ్యర్థి ఎంపికపై బుగ్గన వ్యూహకాత్మకంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి లో ఉండటంతో ఆ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట.ఈ క్రమం లోనే సామాజిక సమీకరణాలు ,వ్యక్తిగత ఇమేజ్,ఆర్థిక బలం లాంటి అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుని చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఓ ప్రాథమిక నిర్దారణ కు బుగ్గన వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
ఆ ఎన్నారై వైపే వైసీపీ చూపు…
డోన్ మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థి గా పట్టణానికి చెందిన ఓ ఎన్నారై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.దూదేకుల,పింజరి సామాజిక వర్గానికి చెందిన ఆ ఎన్నారై వైసీపీ కి తన సేవలందిస్తూ మాజీ మంత్రి బుగ్గన సన్నిహిత వర్గాల్లో ఒకరుగా స్థానం పొందారు.యువకులు రాజకీయాల్లో కి రావాలని ఆకాంక్షించే బుగ్గన యువతను ప్రోత్సహించడం కూడా అతనికి కలిసొచ్చే అంశంగా కనబడుతోంది.
గత ఎన్నికల్లో బుగ్గన చేసిన అభివృద్ధి పనులను డిజిటల్ పబ్లిసిటీ ద్వారా ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం లో చురుకైన పాత్ర పోషించారు.
రాబోయే డోన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు అర్జున్ రెడ్డి ని బరిలో దింపాలని యోచిస్తున్న బుగ్గన అందుకనుగుణంగా ఇప్పటి నుంచే పార్టీలో యువ నాయకత్వాన్ని తయారు చేయాలని భావిస్తున్నారని సమాచారం.
*క్లీన్ చిట్ ఇమేజ్ , సామాజిక సమీకరణలే కీలకం…
అంతే కాకుండా ఆ ఎన్నారై సామాజికవర్గమైన పింజరి,దూదేకుల ,ముస్లిం లు పట్టణ ఓటర్లలో దాదాపు పదహాదు వేల ఓట్లు కలిగి అత్యధిక ఓటు బ్యాంకు గా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండడం కీలకంగా మారింది.అతని కుటుంబం వారి సామాజిక వర్గం లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు.కీలకమైన చైర్మన్ పదవి కట్టబెడతామంటే ఆ సామాజిక వర్గీయుల ఏకపక్ష మద్దతు కూడా లభిస్తుందని వైసీపీ భావిస్తోందట.
వైసీపీ లోని పలువురు నాయకులను పరిగణలోకి తీసుకుని ఆలోచన చేసినప్పటికి వారి సామాజిక సమీకరణాలు ,
వారిపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా కొందరిని,ఎన్నికల కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడడం కారణంగా కొందరిని పక్కకుపెట్టినట్లు వైసీపీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్లీన్ చిట్ ఇమేజ్ ఉన్న కొత్త ముఖాన్ని బరిలోకి దింపడం ద్వారా పట్టణ ఓటర్లను ఆకర్షించడం సులువవుతుందని ఆలోచిస్తునట్లు తెలుస్తోంది.
ఆ ఎన్నారై తండ్రి విశ్రాంత అటవీ అధికారిగా ఉండటం ,స్వతహాగా గల్ఫ్ దేశాల తో పాటు ఇతర దేశాలలో ఇరవై ఏళ్ళ పాటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ముంబై కేంద్రంగా ఎగుమతుల వ్యాపారం కొనసాగిస్తుండడం తో
ఆ ఎన్నారై ఎన్నికల్లో అయ్యే ఖర్చులను కూడా భరించుకోగల శక్తి ఉన్నట్లు తెలుస్తోంది.
చైర్మన్ సీట్ కేటాయింపు రిజర్వేషన్ జనరల్ అయినా, బీసీ అయినా కూడా ప్రత్యర్థి కూటమి పార్టీ ల తరుపున బరిలో దిగే అవకాశాలున్న వారిని దృష్టిలో ఉంచుకొని అన్ని లెక్కలు సరి చూసినా ఆ ఎన్నారై నే సరైన అభ్యర్థి అని వైసీపీ భావిస్తోందని సమాచారం.
అనుకూల ,ప్రతికూలతలు
విద్యావంతుడైన యువకుడు కావడం ,తన తండ్రి అటవీ శాఖలో సుధీర్ఘ కాలం పాటు కీలక బాధ్యతల్లో విధులు నిర్వహించడం ద్వారా ఉన్న పరిచయాలు ఆయనకు కలిసొచ్చే అంశాలు కాగా, రాజకీయ నేపత్యం లేకపోవడం కారణంగా ప్రజాసంబంధాలు తక్కువగా ఉండడం,పూర్తిగా పట్టణ ప్రజలకు కొత్త ముఖం కావడం లాంటి ప్రతికూల అంశాల ను వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
అవకాశం ఉంది సరే ...మరి ఆసక్తి ఉందా.…
బుగ్గన పై ప్రత్యేక అభిమానంతో వైసీపీ లో కొనసాగుతున్న ఆ ఎన్నారై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేనట్లు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.మరి అధిష్టానం ప్రతిపాదిస్తే ఆయన ఆలోచనలో మార్పు ఉంటుందా అనేది వేచి చూడాలి