BREAKING
ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: 'చుట్టమల్లె' ఏఐ వీడియో వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన రామ్ గోపాల్ వర్మ ఆశా వర్కర్ దరఖాస్తుదారులకు ముగిసిన ఇంటర్వ్యూలు రియాద్‌పై హూతీల దాడి వాదనను ఖండించిన సౌదీ అరేబియా మహిళ దారుణ హత్య రజత పతకాలు సాధించిన అంతిమ్ పంఘల్, మహిళల గోల్ఫ్ జట్టు - *వైసీపీ కంచుకోట బద్దలు.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై టీడీపీ తీర్థం పుచ్చుకున్న 25 కుటుంబాలు* ఈ నెల 10 నుంచి గుత్తి అర్ఎస్ లో అంతర్రాష్ట్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ వైభవ్ సూర్యవంశీకి సెండ్ ఆఫ్ ఇవ్వడంపై సాయీ అయూబ్ తీరును తప్పుబట్టిన మాజీ పాకిస్థాన్ క్రికెటర్ మెటా పన్ను వివాదం.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి*

అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి

Select Suryaa Now
అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి

నలుగురు మృతి చెందడం బాధాకరం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

విదేశీ పర్యటనలో ఉండి వెంటనే స్పందించిన గడ్డం ప్రసాద్ కుమార్

 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 3): 

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌ డౌన్‌లో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంపై శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు  మృతి చెందడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు బస్సు ప్రమాదం విషయం తెలియగానే వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ భరోసా ఇచ్చారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.