ఈ నెల 10 నుంచి గుత్తి అర్ఎస్ లో అంతర్రాష్ట్ర ఫుట్ బాల్ టోర్నమెంట్
అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి అర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈ నెల 10 నుంచి 12 వరకు అంతర్రాష్ట్ర ఇన్విటేషన్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం గుత్తి అర్ ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నవీన్, సాల్మన్ రాజా, చాంద్ బాషా మాట్లాడుతూ గౌతమీపురి ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ, రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేమ్ & సూరి మెమోరియల్ ఇన్విటేషన్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో విజేత జట్టుకు ట్రోఫీలు, మెడల్స్ తో పాటుగా రూ.50వేలు, రన్నర్స్ కు రూ.25వేలు ప్రైజ్ మనీ ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గుత్తి అర్ఎస్ కు చెందిన సీనియర్ ఫుట్ బాల్ క్రీడాకారులు వసంత్ కుమార్ (ప్రేమ్), సురేష్ బాబు (ఫుట్ బాల్ సూరి) జ్ఞాపకార్ధంగా మిత్ర బృందం నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో ఏపీ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయని గౌతమీపురి ఫుట్ బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు ఈ నంబర్లకు ఫోన్ చేసి విజయ్ 9985678208, మోహన్ 9052653405 నమోదు చేసుకోవాలని అన్నారు.