సామాన్యుడిలా ఐరన్ చేసి సర్ప్రైజ్ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి...!
కావలి, మేజర్ న్యూస్ : కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ప్రజల్లో ఒకరిగా మమేకమవుతూ,వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా కావలి పట్టణంలోని 37వ వార్డులో శనివారం 'ఇంటింటికీ ఎమ్మెల్యే' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వైభవంగా చేపట్టారు. ప్రతి గడపకూ తిరుగుతూ, స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి కష్టసుఖాలను, సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.
అబ్బురపరిచిన ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా రోడ్డు పక్కన కష్టపడి బట్టలు ఐరన్ చేసుకుంటున్న ఒక సామాన్య కార్మికుడిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గమనించారు. హోదాను పక్కనపెట్టి, నేరుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పలకరించారు. అంతేకాకుండా, తానే స్వయంగా ఒక షర్టును ఐరన్ చేసి అక్కడ ఉన్న స్థానికులను, పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రజాప్రతినిధిగా ఎంత ఎదిగినా, సామాన్యుల శ్రమకు గౌరవం ఇచ్చే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నైజం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
పథకాల అమలుపై ఎమ్మెల్యే ఆరా : అనంతరం ఆ ఐరన్ కార్మికుడితో కావ్య కృష్ణారెడ్డి కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అతనికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలనేదే తమ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ పర్యటనతో 37వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఓపికగా విని, తక్షణమే స్పందించే గుణం ఉన్న కావ్య కృష్ణారెడ్డి తమ ఎమ్మెల్యేగా ఉండటం ఎంతో గర్వకారణమని వార్డు ప్రజలు కొనియాడారు..