BREAKING
ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: 'చుట్టమల్లె' ఏఐ వీడియో వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన రామ్ గోపాల్ వర్మ ఆశా వర్కర్ దరఖాస్తుదారులకు ముగిసిన ఇంటర్వ్యూలు రియాద్‌పై హూతీల దాడి వాదనను ఖండించిన సౌదీ అరేబియా మహిళ దారుణ హత్య రజత పతకాలు సాధించిన అంతిమ్ పంఘల్, మహిళల గోల్ఫ్ జట్టు - *వైసీపీ కంచుకోట బద్దలు.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై టీడీపీ తీర్థం పుచ్చుకున్న 25 కుటుంబాలు* ఈ నెల 10 నుంచి గుత్తి అర్ఎస్ లో అంతర్రాష్ట్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ వైభవ్ సూర్యవంశీకి సెండ్ ఆఫ్ ఇవ్వడంపై సాయీ అయూబ్ తీరును తప్పుబట్టిన మాజీ పాకిస్థాన్ క్రికెటర్ మెటా పన్ను వివాదం.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి*

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గుడ్‌‌బై: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు

Select Suryaa Now
వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గుడ్‌‌బై: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు

విజయనగరం అక్టోబర్ 3 మేజర్ న్యూస్:

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆ పార్టీ అధిష్ఠానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిన్న శ్రీను రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలు, తర్జనభర్జనల మధ్యే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో బొత్స సత్యనారాయణతో కలిసి కాంగ్రెస్‌లో రాజకీయ ప్రయాణం ప్రారంభించామని, ఆ తర్వాత వైసీపీలో చేరి పార్టీని ఎంతో నిలబెట్టామని తెలిపారు. అయితే, నిన్న తనపై పార్టీ వ్యతిరేక విధానాల సాకు చూపి సస్పెండ్ చేయడం తీవ్ర బాధ కలిగించిందన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు గానీ, సస్పెండ్ చేసినప్పుడు గానీ తన అభిప్రాయం అడగకపోవడం దారుణమని, అసలు పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందా, పారదర్శకత ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ ఒక నియంత అని, వైసీపీ ఒక నియంతృత్వ పార్టీలా మారిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. చిన్న శ్రీను తనకు బావ కాబట్టే తనను పార్టీ నుంచి తప్పించారని, మరి బొత్స సత్యనారాయణకు కూడా ఆయన బావే కదా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బొత్సను కాదనే ధైర్యం అధిష్ఠానానికి ఉందా అని సవాల్ విసిరారు. ఈ రోజుల్లో ఆస్తులు అమ్మి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీని అన్ని విధాలా నిలబెడితే, పర్యటనలు, యాత్రల పేరుతో ప్రతి కార్యక్రమంలో డబ్బునే ప్రధానం చేశారని ఆరోపించారు. గతంలో లేని ఇలాంటి రుగ్మతలు రాజశేఖరరెడ్డి, జగన్ వచ్చిన తర్వాతే మొదలయ్యాయన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త ఓపిక పట్టకుండా, తొలి నెల నుంచే ఆర్థిక ఇబ్బందులతో కూడిన కార్యక్రమాలు చేయించి నాయకులను రోడ్డున పడేశారని, ప్రజలతో సంబంధం లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల క్యాడర్‌కు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోటరీని నమ్ముకుని, "సింహం సింగిల్" అంటూ బీజేపీని వదులుకోవడం వల్లే జగన్‌కు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని, లేదంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి మరిన్ని సీట్లు వచ్చేవని అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీని రాజకీయ పార్టీగా కాకుండా ఒక "లిమిటెడ్ కంపెనీ"లా నడుపుతున్నారని, రాజకీయ అనుభవం లేనప్పుడు సీనియర్లు చెప్పే మాటలు వినడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం తనకు సంఘీభావంగా చాలామంది నాయకులు పార్టీని వీడుతున్నారని, మిగతా వారు కూడా పార్టీ తీరుపై ఆలోచన చేయాలని బడ్డుకొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు.