కదిరి క్రికెట్ ప్రతిభకు వేదిక.. మచ్చ రామలింగారెడ్డి
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
కదిరి డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్‌డీటీ ఆధ్వర్యంలో క్రికెట్ ప్రతిభాన్వేషణ ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డీటీ ప్రాంతీయ సంచాలకులు రఘురామ్, క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. కదిరి నుంచి పలువురు రంజీ క్రీడాకారులు ఎదిగారని, ప్రతిభావంతులకు అవసరమైన క్రీడా సౌకర్యాలు, శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఎంపికల్లో మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపికదారులు సాయి కార్తీక్‌రావు, విజయ్, ప్రశాంత్‌రెడ్డి, షకీర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.