ఉరవకొండలో ఆర్‌డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు ఆర్‌డిటి చేపట్టిన గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణకు విశేష స్పందన లభించింది.
ఉరవకొండ జూనియర్ కళాశాల మైదానంలో అండర్-15, అండర్-18 విభాగాల్లో నిర్వహించిన ఎంపికలకు 191 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
జిల్లాలోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు జాతీయస్థాయి శిక్షణ అందించడమే లక్ష్యమని ఆర్‌డిటి క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.
ఇప్పటివరకు రెండు జిల్లాల్లో 11 కేంద్రాల్లో ప్రతిభాన్వేషణ నిర్వహించినట్లు ఆర్‌డిటి ఆర్‌డీ కృష్ణవేణి పేర్కొన్నారు.
క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో కోఆర్డినేటర్ కె. ప్రవీణ్, సెలెక్టర్లు, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు పాల్గొన్నారు.