పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
సూర్య పెద్దపల్లి: భూమ్‌నగర్ ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కలాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పెద్దపల్లి టౌన్ పోలీసులు 02-10-2026న భూమ్‌నగర్‌లో దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 ప్లేయింగ్ కార్డులు, రూ.28,120 నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరుగురు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.