షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి బేరా సొసైటీ డెడ్ బాడీ ఫ్రీజర్ విరాళం:
జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి చేతుల మీదుగా అందజేత…
బేరా సొసైటీ చైర్మన్ డాక్టర్ రెడ్డి ఉదారతపై అదనపు కలెక్టర్ కిరణ్మయి ప్రశంసలు…
సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషిస్తూ బేరా సొసైటీ ప్రతినిధులు మంగళవారం మరొక సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అవసరాల నిమిత్తం డెడ్ బాడీ ఫ్రీజర్ (Dead Body Freezer)ను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి చేతుల మీదుగా డిప్యూటీ డాక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి సూపరిండెంట్ విష్ణువర్ధన్ తదితర అధికారులకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. అత్యవసర సమయంలో భౌతికకాయాలను భద్రపరచడానికి ఈ ఫ్రీజర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజ హితం కోసం బేర సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మానుకోట బేరా , లయన్స్ క్లబ్ టౌన్ ప్రతినిధులు చేస్తున్న సేవలను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బేరా సొసైటీ చైర్మన్ డాక్టర్ రెడ్డి, లయన్స్ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ కమ్మదనం సుధాకర్, ట్రెజర్ శాంతి లాల్, డాక్టర్ గోపాల్, లయన్ దండు శరత్ చంద్రబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు, అడ్వకేట్ రవీందర్ రెడ్డి, ఆస్పత్రి వైద్య సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
M. నరసింహ రెడ్డి , మేజర్ న్యూస్, ఫరూక్ నగర్….