సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యల పరిష్కారానికి కృషి
జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున నిరంతరం కృషి చేస్తున్నామని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి వెంకట్రామ్ పేర్కొన్నారు.గురువారం మాజీ కౌన్సిలర్ కే లక్ష్మీనారాయణ,స్థానిక నాయకులతో కలిసి డిప్యూటీ కమిషనర్ శ్రీరామ కాలనీలో పర్యటించి,కాలనీలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ రామ కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాను అన్నారు. పరిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారించమని,రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని,అలాగే ఎక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయో అక్కడ తాత్కాలిక మరమత్తులు చేయిస్తామని, డ్రైనేజీ లీకేజీలు ఉన్న ప్రాంతలను ముందస్తుగా గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించేలా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచి స్తున్నామని తెలిపారు. శ్రీరామ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం అధ్యక్షులు మస్న రవికుమార్, గుద్దేటి బిక్షపతి, మురళి, పరమేష్, కంది బిక్షపతి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.