ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటరు లిస్టులో నమోదు చేయించాలి - తలసాని
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సనత్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఏ ఒక్క గ్రాడ్యుయేట్ తప్పిపోకుండా ప్రతి ఒక్కరిని ఓటరు లిస్టులో పేరు నమోదు చేయించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ కార్యకర్తలకు సూచించారు. మహంకాళి దేవాలయ ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు కొండాపురం మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో మోండాలో ఒకే రోజు 50 మంది గ్రాడ్యుయేట్లను జాబితాలో చేర్పించి తలసానికి అందించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఓటర్లుగా చేర్పించాలని, నియోజకవర్గంలో వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చురుగ్గా గ్రాడ్యుయేట్ ఓటరు జాబితా నమోదులో పాల్గొన్న మహేష్ యాదవ్ బృంధాన్ని తలసాని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, రఘు, నరేష్, వైబీ వెంకట్, హరీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.