మున్సిపల్ చైర్ పర్సన్ కు దివ్యాంగుల వినతి
సూర్య బాన్సువాడ,: బాన్సువాడ మున్సిపల్ చైర్ పర్సన్ కు దివ్యాంగుల హక్కుల సమితి తరపున సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడలోని దివ్యాంగుల సౌకర్యార్థం వారి సమస్యలు పరిష్కరించుకునేలా, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు గాను దివ్యాంగుల భవనం అవసర మని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 22 జూన్సూ 2023 సూచనల మేరకు బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కృపా నగర్ ఫేజ్ 1 లో 400 గజముల స్థలం ఇప్పించాలని కోరుతూ వారు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుమ్మరి సాయిలు కార్యదర్శి గొల్ల గంగాధర్ యాదవ్ మహిళా అధ్యక్షులు ఎర్వల మేఘమాల మహిళా కార్యదర్శి తాటి సావిత్రి రమేష్ దివ్యాంగులు పాల్గొన్నారు.