సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ
అనంతపురం బ్యూరో : మండలంలోని చిన్న జలాలపురం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మొండిపోగుల ఓబుళపతి మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఓబుళపతి మృతి చెందిన విషయం తెలుసుకున్న మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు చిన్న జలాలపురం గ్రామానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ గోరంట్ల మారుతి నాయుడు, సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ, మాజీ మండల పార్టీ కన్వీనర్ రాఘవరెడ్డి, మాసుల చంద్రమోహన్, మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప, రవిశంకర్, కొయ్యగూర పెద్దన్న, బండి పరశురాం, మొండిపోగుల ఎర్రిస్వామి, జింకల వెంకటరమణ, ఏకిల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబానికి నాయకులు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓబుళపతి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన మృతి బాధాకరమన్నారు.
ఓబుళపతి కుటుంబానికి పార్టీ నాయకులు అండగా ఉంటారని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.