BREAKING
బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ. 1.44 లక్షల కోట్ల మెగా దావా: న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ శెట్టి! జిల్లాలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాస్త్రీయ దృక్పథంతోనే సమాజాభివృద్ధి మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలి: ఏ. రవి ఇన్విట్ ప్రైవేటైజేషన్ కోసం రంగంలోకి దిగిన దిగ్గజ ఇన్వెస్టర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ. 1.44 లక్షల కోట్ల మెగా దావా: కోర్టును ఆశ్రయించిన బీఆర్ శెట్టి! ఏఐ డీప్‌ఫేక్స్ పై సీరియస్ అయిన హీరోయిన్ శ్రియా శరణ్.. మహిళలపై డిజిటల్ వేధింపులు సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు! ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ ఆటో రంగానికి ముప్పు మున్ముందు దుర్గామాత స్వాములకు భిక్ష ఏర్పాటు పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు గాయం.. మెడికల్ వాకింగ్ బూట్‌తో ఫొటో షేర్ చేసిన నటుడు! ఆసియా ఇన్వెస్టర్ల చూపు హెడ్జ్ ఫండ్లపై రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ అమలు: స్పష్టం చేసిన ఎన్‌పీసీఐ!

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం

Select Suryaa Now
భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం

• సామాన్య భక్తులకు మెరుగైన దర్శన ఏర్పాట్లు

  • రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. భద్రతకు పెద్దపీట
  • ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన దర్శనాన్ని కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం, సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం సజావుగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడుతున్నామని, మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. వీఐపీ భక్తులతో పాటు సామాన్య భక్తులకు కూడా ప్రాధాన్యతనిస్తూ, రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భక్తులు ఎక్కువసేపు ఇబ్బందులు పడకుండా దర్శన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఉత్సవాల సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి భక్తుడికి ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని రామచంద్ర మోహన్ వెల్లడించారు.