రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
సూర్య బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను మంగళవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 1000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సాంస్కృతిక కళ్యాణ వేదిక భవనాన్ని (ఫంక్షన్ హల్) ను రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తో కలిసి ఎమ్మెల్యే పోచారం ప్రారంభించడం జరిగింది.
ఈసందర్భంగా కాలనీవాసులు, పట్టణ ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈభవనం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాస్, నార్ల రవీందర్, నార్ల సురేష్, అలిమొద్దీన్ బాబా, యండి. దావూద్, నర్సన్న చారి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, ఎమ్మార్వో రాజా నరేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.