డిల్లీలో... జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో..... రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ...
#.తెలంగాణలో చేపట్టాల్సిన కీలక రహదారులు--- వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్వేలపై చర్చించారు.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... తెలంగాణలో చేపట్టాల్సిన కీలక రహదారులు వంతెనలు ఎలివేటెడ్ కారిడార్లు రూటువేలతో పాటు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో భేటీ అయి పలుఅంశాలపై చర్చించారు.ఎల్బీనగర్–హయత్నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు ఆమోదం,
కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ వంతెన ద్వారా యన్ హెచ్ -167కే మీదుగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం మెరుగుపడి, రవాణా, పర్యాటక రంగాలకు ఊతం లభించనుందని మంత్రికి వివరించారు. అదేవిధంగా హైదరాబాద్–శ్రీశైలం యన్ హెచ్ -765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.యన్ హెచ్-65 హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచుతామని హామీ ఇవ్వడంతోపాటు పర్వతమాల పథకం కింద తెలంగాణలో ఐదు రోప్వేల ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
తెలంగాణలో 34 పనులకు సి ఆర్ ఐ ఎఫ్ నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీచేశారు.పుల్లూరు–అలంపూర్–జట్రపోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్–లింగాల–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనపై సానుకూల కేంద్రమంత్రి స్పందించారు.హైదరాబాద్లో నవంబర్ 19 నుంచి 22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించి హాజరవుతానని తెలిపారు. తెలంగాణలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రవాణా సౌకర్యాలను విస్తరించడం, పర్యాటక అభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ భేటీ కీలక ముందడుగుగా నిలిచింది.ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్రానికి సంబంచిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.