telanagana
పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : పక్క ప్రణాళికలతో లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో మంగళవారం ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఐఎఫ్పి ప్యానెల్, వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం స్టడీ సర్కిల్ శిక్షణతో కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన అభ్యర్థి ఉమ భారతిని శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హాజరవుతూ, అదే ఎనర్జీ మూమెంటమ్ను మెయింటైన్ చేయాలని సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షను ప్రతి ఒక్కరూ సాధించడంతో పాటు, ఫిజికల్ ఈవెంట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పోలీసు శాఖ సహకారంతో మంచి శిక్షణ పొందాలని, కేవలం ఎక్కువ కంటెంట్ చదవడం కంటే లిమిటెడ్ కంటెంట్ను పదే పదే రివిజన్ చేయడం, ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరు విజేతలుగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్, రమేష్, అధ్యాపకులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.