గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ
మాడ్గులపల్లి, మేజర్ న్యూస్: మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ కుక్కముడి వెంకటయ్యను విధుల్లోకి రాకుండా అడ్డుకుంటూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు పై మంగళవారం మండల పంచాయతీ అధికారి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.2019 నుండి నిబద్ధతతో పనిచేస్తున్న తనను ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సింగం కార్తీక్తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ రెడ్డిలు అక్రమంగా విధులకు దూరం చేశారని బాధితుడు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.
తన నియామక పత్రాలు, బ్యాంకు ద్వారా పొందిన వేతనాల వివరాలు, వేధింపులకు సంబంధించిన ఆధారాలను విచారణ అధికారికిలిఖితపూర్వకంగా అందజేశాడు.తనకుటుంబానికి జీవనాధారమైన ఉపాధి ని దూరం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసు కొని, తనకు తిరిగి విధులునిర్వహించుకునేలాఉత్తర్వులుజారీచేయాలనివెంకటయ్య కోరాడు.విచారణ అనంతరం అధికారి సంబంధిత రికార్డులను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.