BREAKING
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ

భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ ప్రతినిధి: భూముల రీ సర్వే ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.మంగళవారం తానూరులో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను సర్వే పురోగతి, చేపడుతున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.రీ సర్వే నిర్వహించే ముందు సంబంధిత రైతులందరికీ ముందస్తుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహిస్తూ, ఎలాంటి వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే బృందంలోని సిబ్బంది అందరూ విధిగా పాల్గొని, నిర్దేశించిన గడువులోగా రీ సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. సర్వే సమయంలో సంబంధిత భూముల రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. రీ సర్వే ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు సహకరించాలని కోరారు.ఈ పరిశీలనలో తహసీల్దార్ మహేంద్రనాథ్, సర్వేయర్ కిషన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.