జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం
తెర్లాం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జారీ చేసిన నియామకపు ఉత్తర్వుల ప్రకారం రాజాం నియోజకవర్గ o సమన్వయకర్తగా నేతుల స్రవంతి బాధ్యతలు చేపట్టిన తరుణ నాన పరిష్కరించుకొని స్థానిక ఆ పార్టీ నాయకులు ఆమెకు మంగళవారం చిరు సన్మాన o ఏర్పాటు చేసి శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నేతుల స్రవంతి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి తనకు అప్పగించిన బాధ్యతలు శత శాతం నిర్వహించడానికి కృషి చేస్తానని అందరిని ఒకే తాటిపై నడిపించి పార్టీ అభివృద్ధికి దోహదపడతానని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి తాను వెంట ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆమె పేర్కొన్నారు.. ఏ నమ్మకంతో జనసేన పార్టీ అధినేత తనకి బాధ్యతలు అప్పగించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమెతోపాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
రిపోర్టర్ : తిరుపతి నాయుడు, తెర్లాం, విజయనగరం జిల్లా.