జిల్లాలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఉపాధి కూలీకి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఈరోజు నంద్యాల మండలం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల మండల మహాసభ నంద్యాల సిఐటియు జిల్లా కార్యాలయంలో బండి రత్నమయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ నాయక్ సిఐటియు జిల్లా కార్యదర్శిలు వెన్న బాల వెంకట్ డి లక్ష్మణులు పాల్గొని మాట్లాడుతూ ఎల్ నీ ఓ ప్రభావం వల్ల నంద్యాల మండలం కరువు మండలంగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కూడా ఉపాధి పనులు అన్ని గ్రామాల్లో ప్రారంభించకపోవడం వల్ల వ్యవసాయ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షాత్తు మన జిల్లా కలెక్టర్ మేడం గారు అన్ని గ్రామాల్లో వెంటనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించినప్పటికీ మండల ఏ పీ ఓ ఏ గారు స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా ఉందని వెంటనే నంద్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు లేకుంటే వ్యవసాయ కార్మికులు అందరినీ కలుపుకొని ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.అనంతరం నంద్యాల మండలం వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని మహాసభ ఏకీభవంగా ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షునిగా బంగారయ్య కార్యదర్శిగా చెరుకు కృష్ణ ఉపాధ్యక్షులుగా జయన్న బండి రత్నమయ్య, ప్రభుదాసు, సహాయ కార్యదర్శిగా రామకృష్ణ, నాగలక్ష్మి సునీల్ కుమార్, బసురున్ బి ఆంటోనీ కమిటీ సభ్యులుగా నూర్ భాషా, నాగలక్ష్మి, ఏ సంజీవరాయుడు, అశోక్ కుమార్ రంజాబి, తోపాటు 20 మందిని కమిటీ సభ్యులుగా ఏకీభవంగా ఎన్నుకున్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*