BREAKING
థాంగ్‌-టా మార్షల్ ఆర్ట్స్‌లో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారుల ప్రతిభ.. కీర్తన, పవినాయ్‌కు బంగారు పతకాలు డిసి యూనివర్స్‌లోకి ప్రవేశించడం వెనుక కఠినమైన ఆడిషన్స్.. హాలీవుడ్ నటి నయోమి ఆకీ ఆసక్తికర విషయాలు! అన్నపూర్ణాదేవి అవతారంలో పోలమాంబ దర్శనం భూగర్భ జలాలు పడిపోవడంతో లాతూర్‌లో నీరు, పశుగ్రాసం ప్రణాళికలు సిద్ధం చేసిన యంత్రాంగం! ఆ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే చేర్చుకోండి: విజయేంద్ర వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కౌంటర్! స్ట్రైక్ రేట్ 100% పక్కా! - వైజాగ్ జనసేనలో స్థానిక ఎన్నికల జోష్ అశ్వారావుపాలెం అభివృద్ధికి రూ.54.60 లక్షలు - పేదలకు భరోసాగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు: నాగబాబు కరువు నివేదికలు పక్కాగా తయారు చేయండి - వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా ఆదేశం - 35,446 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా బాలల భీమాకు టీడీపీ మండల కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు నాయుడు విరాళం బడి బాగుంటేనే భావితరాలకు భరోసా డైరీ ఫారం వద్ద దసరా శరన్న నవరాత్రి ఉత్సవాలు కోర్టు ప్రాంగణాల్లో రాజకీయ ఆందోళనల నిషేధంపై అక్టోబర్ 15న సుప్రీంకోర్టు విచారణ! సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన..!! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలి: తొలగించిన అర్హుల పేర్లను పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్! ఆనందపురం జంక్షన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన....

పారదర్శక ఎన్నికలకు పక్కా ప్రణాళిక! శాఖల సంయుక్త సమన్వయంతోనే ప్రశాంత పోలింగ్‌

Select Suryaa Now
పారదర్శక ఎన్నికలకు పక్కా ప్రణాళిక!  శాఖల సంయుక్త సమన్వయంతోనే ప్రశాంత పోలింగ్‌

గాజువాక, సూర్య : జీవీఎంసీ మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ఎన్నికల ముందస్తు సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లలో భాగంగా గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులతో సంయుక్త సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, జోనల్‌ కమిషనర్లు శేషగిరి, మనీషా త్రిపాఠి మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరంతర నిఘా, ముందస్తు సమాచార సేకరణ ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నియమావళిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఓటర్లు ఎటువంటి భయాలు, ప్రలోభాలకు తావులేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, అనువైన రాకపోకల మార్గాలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతి కేంద్రం వద్ద తప్పనిసరిగా ర్యాంపులు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గాజువాక, పెదగంట్యాడ తహసీల్దార్లు త్రినాథ్, పీ.అమల, సీఐలు సి.హెచ్.వాసునాయుడు (గాజువాక), నమ్మి గణేష్ (దువ్వాడ), కేశవరావు (స్టీల్ ప్లాంట్), లంక భాస్కరరావు (పరవాడ), న్యూపోర్టు ఎస్సై శ్యామ్‌కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రసాద్, సౌత్ సబ్ డివిజన్ ఎస్సైలు, సెక్టార్ ఇన్ఛార్జి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.