థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్‌లో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారుల ప్రతిభ.. కీర్తన, పవినాయ్‌కు బంగారు పతకాలు
పార్వతీపురం, సూర్య : మన్యం జిల్లా క్రీడాకారులు థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయి పోటీల్లో కీర్తన, పవినాయ్ బంగారు పతకాలు సాధించగా, మరో 12 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచారు.
విజయవాడలోని జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కళాశాల వేదికగా నిర్వహించిన పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మొత్తం 30 మంది పాల్గొన్నారు. వీరిలో 17 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయికి చేరుకున్న జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించడం విశేషం.
ఈ పోటీల్లో కీర్తన అండర్-5 విభాగంలో, పవినాయ్ అండర్-19 విభాగంలో బంగారు పతకాలు సాధించారు. మిగిలిన విభాగాల్లో 12 మంది రన్నరప్‌గా నిలిచారు. క్రీడాకారులకు కోచ్ ఎస్. మురళి శిక్షణ అందించారు. ఆయన శిక్షణలో క్రీడాకారులు సాధించిన విజయాలు జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చాయి.
రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.