BREAKING
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం

44 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు శంకుస్థాపన -పద్మావతి అమ్మవారి ఆలయానికి ట్రాఫిక్ కష్టాలకు చెక్

Select Suryaa Now
44 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు శంకుస్థాపన -పద్మావతి అమ్మవారి ఆలయానికి ట్రాఫిక్ కష్టాలకు చెక్

 

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి రాకపోకలను సులభతరం చేస్తూ, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.44 కోట్లతో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలో కొట్రమంగళం రోడ్డు జంక్షన్ నుంచి పూడి రోడ్డు జంక్షన్ వరకు నిర్మించనున్న ఈ రహదారికి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జాతీయ రహదారి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇరుకైన రోడ్ల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు కొత్త రోడ్డుతో తొలగిపోతాయన్నారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు, నిర్మాణాలు కోల్పోయే వారికి నిబంధనల ప్రకారం పరిహారం, టీడీఆర్ బాండ్లు అందిస్తామన్నారు. తుడా చైర్మన్  మాట్లాడుతూ... తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుచానూరు అమ్మవారిని కూడా దర్శించుకోవడంతో యాత్రికుల రద్దీ పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలు, పంచమి తీర్థం వంటి రద్దీ రోజుల్లో మెరుగైన రవాణా, పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో తుడా, టీటీడీ ఆధ్వర్యంలో 8 మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్