భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన
పలమనేరు సూర్య;పలమనేరు పట్టణంలోని కాకాతోపు, గాంధీనగర్ ప్రాంతాల భూ సమస్యలను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఈ నెల 12న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పట్టణంలోని సర్వే నంబరు 596లో 1985లో పట్టాలు పొందిన పలువురు సుమారు 40 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ భూమి వర్గీకరణ మార్పు, గృహ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ సూచించారు.అలాగే సర్వే నంబర్లు 963, 964లోని భూములకు సంబంధించి సుమారు 400 మంది ఎదుర్కొంటున్న సమస్యను కూడా పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు, వక్ఫ్ భూముల నమోదు అంశం, న్యాయస్థానాల ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతిపాదనలు సమర్పించి, సమస్యల పరిష్కారానికి చర్యలుతీసుకుంటున్నట్లు తహశీల్దారు తెలిపారు.