దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఎమ్మిగనూరు ;దసరా ఉత్సవాల్లో భాగంగా జరుగు శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఉత్సవాలకు ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి కి మంగళవారం ఆహ్వాన పత్రికను నిర్వాహకులు సురేష్ చౌదరి, భార్గవ్ యాదవ్ చంద్రబాబు నాయుడు సురేష్ లు అందించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, అష్టోత్తరాలు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదీష్ చౌదరి , నర్సన్న గౌడ్, బిపిన్ చంద్ర , నాగార్జున రెడ్డి , రాజు తదితరులు పాల్గొన్నారు.