BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Select Suryaa Now
మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల, క్రీడాకారుల చిరకాల కోరిక అయిన మున్సిపల్ ఇండోర్ స్టేడియం ఎట్టకేలకు ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మళ్లాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం లో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, అయితే సరైన వసతులు లేక యువత ఇబ్బంది పడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు, క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్. యోగ , వంటి క్రీడలు ఆడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ , మున్సిపల్ కమిషనర్, ఎం. ఏసుబాబు, కూటమి నాయకులు, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా