ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన ఆశా డే సమావేశంలో కేఎంఏ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు పాల్గొని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లు మరియు ఇతర ఆరోగ్య సిబ్బందికి ఆర్ సి హెచ్ 2.0 పోర్టల్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా, లబ్ధిదారులను సమర్థవంతంగా గుర్తించడం, వారి ఆరోగ్య వివరాలను పర్యవేక్షించడం మరియు తల్లి-శిశు ఆరోగ్య సేవలను సకాలంలో అందించడం కోసం ఆర్ సి హెచ్ 2.0 పోర్టల్‌లో 100 శాతం ఆశా మ్యాపింగ్‌ను పూర్తి చేయడం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఆశా కార్యకర్తల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యకలాపాలు మరియు వారి పని తీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ అవసరమైన ఆరోగ్య సేవలు అందేలా కృషి చేయాలని, తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆశా కార్యకర్తలను ప్రోత్సహించారు. అలాగే, ఆర్ సి హెచ్ 2.0 పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను సకాలంలో, ఖచ్చితంగా నమోదు చేయాలని ఏఎన్ఎం లకు సూచించారు. దీనివల్ల లబ్ధిదారుల వివరాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు, తల్లి-శిశు ఆరోగ్య సేవల అమలును మెరుగుపరచవచ్చని వివరించారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ (ఎం ఓ), సి హెచ్ ఓ మంగరాజు, హెచ్ ఈవి, ఎం.వి, ఎంహెచ్పిఎస్(ఎం), ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లు, హెచ్ ఎల్ పి ఎస్ లు పాల్గొన్నారు.