BREAKING
కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్

జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష

Select Suryaa Now
జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష

జంగారెడ్డిగూడెం సూర్య న్యూస్: గ్రేడ్‌-1 మున్సిపాలిటీ చైర్మన్‌ పదవికి వెలమ సామాజిక వర్గానికి చెందిన రొంగల అనూష పేరును వెలమ సంక్షేమ సంఘం ప్రతిపాదించింది. జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు డా. రాజాన సత్యనారాయణ (పండు) సారథ్యంలో వెలమ సంఘీయులు సమావేశమై, తెలుగుదేశం పార్టీ తరఫున అనూషను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన 30 ఏళ్ల రొంగల అనూషకు టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ టికెట్ కేటాయించాలని కోరుతూ పోలవరం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు డాక్టర్ రాజాన సత్యనారాయణ చేతుల మీదుగా దరఖాస్తు అందజేసినట్లు వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం తమ అభ్యర్థనను పరిశీలించి అనూషకు అవకాశం కల్పించాలని వెలమ సంక్షేమ సంఘం కోరింది.చైర్మన్ అభ్యర్థిగా అనూష పేరును సంఘం ప్రతిపాదించిన నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా