BREAKING
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం

అమ్మవారి సేవలో "బాలిపల్లి" దంపతులు... అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అందరికీ కలగాలని అన్నప్రసాద వితరణ

Select Suryaa Now
అమ్మవారి సేవలో "బాలిపల్లి" దంపతులు...  అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అందరికీ కలగాలని అన్నప్రసాద వితరణ

భోగాపురం, సూర్య : అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు ఎంత పవిత్రమో.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కూడా అంతే పుణ్యప్రదమనే భక్తిభావంతో బాలిపల్లి సత్తిబాబు, జ్యోతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అన్నప్రసాద వితరణ చేపట్టారు. భోగాపురం గ్రామంలోని స్థానిక పెద్దవీధి పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన జగన్మాత విగ్రహం వద్ద సత్తిబాబు, జ్యోతి దంపతులు భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్న వేళ అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం ద్వారా సత్తిబాబు దంపతులు తమ భక్తిని, సేవాభావాన్ని చాటుకున్నారు.
అన్నదానం మహాదానమనే నమ్మకంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జగన్మాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని దంపతులు ఆకాంక్షించారు. భక్తి, సేవ, దాతృత్వం కలగలిసిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.

 

రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.