విద్యార్థినిలకు కంప్యూటర్ శిక్షణ...
గజపతినగరం, సూర్య : స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విద్యార్థినిలకు కంప్యూటర్ విద్యలో భాగంగా పది రోజుల ఇంటర్నషిప్ శిక్షణ మంగళవారం స్థానిక పురిటిపెంట సచివాలయంలో చేపట్టారు. కంప్యూటర్ టీచర్ కార్తీక్ ఆధ్వర్యంలో విద్యార్థునీలు సచివాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను డిజిటల్ ఆపరేటర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ శిక్షణ పది రోజులు కొనసాగుతుందని కంప్యూటర్ ఉపాధ్యాయుడు కార్తీక్ తెలిపారు.ఈ శిక్షణ విద్యార్థినిలకు ఎంతగానో దోహద పడుతుందన్నారు.
రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.