కోర్టు ప్రాంగణాల్లో రాజకీయ ఆందోళనల నిషేధంపై అక్టోబర్ 15న సుప్రీంకోర్టు విచారణ!
సూర్య న్యాయ డెస్క్: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ప్రాంగణాల్లో రాజకీయ ఆందోళనలు, ధర్నాలు మరియు నిరసన ప్రదర్శనలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు అక్టోబర్ 15న విచారించనుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటంతో పాటు కోర్టు ప్రాంగణాల్లో ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించాలనే డిమాండ్‌తో ఈ పిటిషన్ దాఖలైంది.
కోర్టుల ఆవరణల్లో రాజకీయ పార్టీలు, సంఘాలు చేపట్టే ఆందోళనల వల్ల న్యాయ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతోందని, న్యాయవాదులు, కక్షిదారులు మరియు న్యాయమూర్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానాల పరిధిలో ఇలాంటి కార్యక్రమాలను నిరోధించేందుకు దేశవ్యాప్తంగా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేయాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిగణించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి నిర్ణయించింది. కోర్టుల ప్రాంగణాల పవిత్రత, భద్రతకు సంబంధించిన కీలక అంశం కావడంతో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.