కరువు నివేదికలు పక్కాగా తయారు చేయండి - వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా ఆదేశం - 35,446 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ ఎల్నినో ప్రభావం వల్ల వెల్దుర్తి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో కరువు నివేదికల తయారీపై అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల (ఆర్బీకే) సిబ్బందితో మండల వ్యవసాయ అధికారి (ఏవో) కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా . మండలం పరిధిలోని ఖరీఫ్ కాలంలో సాగు చేసిన పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న, సజ్జ, జొన్న మరియు కొర్ర తదితర పంటలకు సంబంధించి సుమారు 35,446 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని తెలిపారు. పంట నమోదు (ఈ-పంట) జాబితా ఆధారంగా ఖరీఫ్‌లో నష్టపోయిన ప్రతి రైతు పేరు తప్పకుండా కరువు జాబితాలోకి వచ్చేలా పక్కాగా నివేదికలు రూపొందించాలని రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు.ఉద్యానవన శాఖాధికారి శ్రీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసి నష్టపోయిన ఉల్లి, మిరప, టమాటా పంటల రైతుల వివరాలను కూడా సమగ్రంగా సేకరించి కరువు జాబితాలో చేర్చనున్నట్లు వివరించారు.ఈ సమీక్షా సమావేశంలో ఉద్యానవన అధికారి శ్రీ నరేష్ రెడ్డితో పాటు వ్యవసాయ సహాయకులు (ఏఈఓలు) అజయ్ భార్గవ్, సంధ్యారాణి, మాలినీ దేవి మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం