BREAKING
బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు ‘కొమరన్ కళ్యాణ్’ జోరు.. ఐదు రోజుల్లోనే రూ.15 కోట్ల మార్కు దిశగా కలెక్షన్లు! ప్రపంచానికి డీజిల్ ఎందుకు అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కీలక కారణాలు! మచిలీపట్నం మేయర్ పీఠంపై అబ్దుల్ అబీదా గురి! కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి

వేద సంప్రదాయాల పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది –- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి

Select Suryaa Now
వేద సంప్రదాయాల పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది      –- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి  చౌదరి

ఏలూరు, సూర్య న్యూస్ : భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరంపర, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడంలో వేద పండితులు, వేద పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఏలూరు పవర్‌పేటలోని చదలవాడ వారి వీధిలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో శ్రీ కాంచీ కామకోటి పీఠానికి చెందిన హేలాపురీ సంస్కృత వేదస్మార్త ప్రయోగ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేద పండిత సభలో పాల్గొని వేద పండితులను అభినందించారు

ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ వేదాలు భారతీయ జీవన విధానానికి, ఆధ్యాత్మిక చింతనకు మార్గదర్శకాలని, వాటిలో నిక్షిప్తమైన జ్ఞానం సమాజానికి ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. వేద సంప్రదాయాలు కేవలం ఆచారాలకే పరిమితం కాకుండా, మానవతా విలువలు, క్రమశిక్షణ, ధర్మబద్ధమైన జీవన విధానానికి పునాదిగా నిలుస్తాయన్నారు.వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు, వేద పాఠశాలలకు సమాజం అండగా నిలవాలని సూచించారు.శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తుచేస్తాయని అన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని గారపాటి చౌదరి తెలిపారు.ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అధ్యక్షులు బి.కె.ఎస్.ఆర్. అయ్యంగార్, కార్యదర్శి సీతంరాజు చక్రధర్, జనసేన నాయకులు నారా శేషు, వేద పండితులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్, ఏలూరు,