కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు*
మండల కేంద్రమైన కుందుర్పిలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల మరియు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య విలయాతాండవం చేస్తుండేది. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కళ్యాణదుర్గం శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని శ్రీరామ్ రెడ్డి తాగునీటిని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా గురుకుల పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు అందిచారు. దింతో ఎమ్మెల్యే మాటిచ్చాడంటే కచ్చితంగా చేస్తాడు అంటూ నిరూపించాడు.నీటి సమస్యతో నిత్యం ఇబ్బందులు పడే విద్యార్థులకు తాగునీటి సమస్య తీరడంతో థాంక్యూ మాఎమ్మెల్యే సార్ అంటూ పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే సురేందర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టి. రాజు రిపోర్టర్ కుందుర్పి