అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకిలోని ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజు అనఘా లక్ష్మీ అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సకల జీవరాశులకు అన్నం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్ కాంతుల నడుమ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఆలయ నిర్వహకులు నాగసూరి హనుమత్ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.