ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక!
ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక!
అనంతపురం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అనంతపురం మూడో పట్టణ పోలీసులు చర్యలు చేపట్టారు. మూడో పట్టణ సీఐ కౌలుట్లయ్య ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను భయపెట్టినా, అల్లర్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రౌడీషీటర్లను తహసీల్దారు ఎదుట హాజరుపరిచి బైండోవర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని పోలీసులు సూచించారు.