ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ
జంగారెడ్డిగూడెం- న్యూస్,మండలంలోని వేగవరం గ్రామంలో ఉపాధి కూలీలకు బీజేపీ, టీడీపీ నాయకులు స్నాక్స్ పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ కొప్పల రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కొప్పాక శ్రీనివాస్ మాట్లాడుతూ, వీబీ–జీ రామ్ జీ పథకం ద్వారా పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు కూలీలకు ఉపాధి కల్పించడం, వేతనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కుక్కల నాగ సూర్యచంద్రరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా