BREAKING
17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు

ఆ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే చేర్చుకోండి: విజయేంద్ర వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కౌంటర్!

Select Suryaa Now
 ఆ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే చేర్చుకోండి: విజయేంద్ర వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కౌంటర్!

సూర్య జాతీయ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటే ఆలస్యం చేయకుండా వారిని తక్షణమే పార్టీలో చేర్చుకోవాలని విజయేంద్రకు శివకుమార్ సవాల్ విసిరారు.

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో అసంతృప్తి నెలకొందని, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కాషాయ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ విజయేంద్ర గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మనుగడపై ప్రశ్నలు లేవనెత్తే ఉద్దేశంతో ప్రతిపక్ష బీజేపీ ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేసింది.

ఈ ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టిన డీకే శివకుమార్, బీజేపీ చేస్తున్నవన్నీ కేవలం మైండ్ గేమ్‌లు, ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల పూర్తి విధేయతతో ఉన్నారని స్పష్టం చేశారు. ఒకవేళ నిజంగానే అంతమంది ఎమ్మెల్యేలు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే శుభకార్యానికి ఆలస్యం ఎందుకని, తక్షణమే ముహూర్తం చూసుకుని చేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం బీజేపీ తరం కాదని ఆయన తేల్చిచెప్పారు.