BREAKING
చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన..!!

Select Suryaa Now
సీసీ రోడ్డు  నిర్మాణానికి శంకుస్థాపన..!!

ఆనందపురం, సూర్య : ఆనందపురం మండలం తర్లువాడ గ్రామాభివృద్ధికి రూ.75 లక్షల నిధులు మంజూరు చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో గ్రామంలో కీలకమైన రహదారి నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. వి.బి.-జి-రామ్‌జీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో కోరాడవీధి నుంచి సోమాలమ్మ గుడి రహదారిని కలుపుతూ సిమెంటు రోడ్డు నిర్మించనున్నారు. ఈ పనులకు గ్రామస్థులు, నాయకులు భూమిపూజ నిర్వహించారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తొలగి, రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాత్రాజు అప్పారావు, బంకు రాజు, తాత్రాజు రామస్వామి, మజ్జి శ్రీను, బాలి అయ్యప్ప, మజ్జి వెంకటరావు, మజ్జి సన్యాసిరావు, కోరాడ ఆదినారాయణ, బాలి వెంకటరావు, బాలి సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.