BREAKING
డిసి యూనివర్స్‌లోకి ప్రవేశించడం వెనుక కఠినమైన ఆడిషన్స్.. హాలీవుడ్ నటి నయోమి ఆకీ ఆసక్తికర విషయాలు! అన్నపూర్ణాదేవి అవతారంలో పోలమాంబ దర్శనం భూగర్భ జలాలు పడిపోవడంతో లాతూర్‌లో నీరు, పశుగ్రాసం ప్రణాళికలు సిద్ధం చేసిన యంత్రాంగం! ఆ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే చేర్చుకోండి: విజయేంద్ర వ్యాఖ్యలపై డీకే శివకుమార్ కౌంటర్! స్ట్రైక్ రేట్ 100% పక్కా! - వైజాగ్ జనసేనలో స్థానిక ఎన్నికల జోష్ అశ్వారావుపాలెం అభివృద్ధికి రూ.54.60 లక్షలు - పేదలకు భరోసాగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు: నాగబాబు కరువు నివేదికలు పక్కాగా తయారు చేయండి - వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా ఆదేశం - 35,446 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా బాలల భీమాకు టీడీపీ మండల కన్వీనర్ గుప్తా శ్రీనివాసులు నాయుడు విరాళం బడి బాగుంటేనే భావితరాలకు భరోసా డైరీ ఫారం వద్ద దసరా శరన్న నవరాత్రి ఉత్సవాలు కోర్టు ప్రాంగణాల్లో రాజకీయ ఆందోళనల నిషేధంపై అక్టోబర్ 15న సుప్రీంకోర్టు విచారణ! సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన..!! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలి: తొలగించిన అర్హుల పేర్లను పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్! ఆనందపురం జంక్షన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.... అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో నటిస్తున్నాననే వార్తలపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

పేదల ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా

Select Suryaa Now
పేదల ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా

నెల్లూరు, మేజర్ న్యూస్ :    అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.  ఆత్మకూరు పట్టణంలోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన బైపాస్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 1,150 కుటుంబాలకు మొత్తం రూ.10,42,08,879 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. తాజాగా మరో 69 కుటుంబాలకు రూ.63,79,000 విలువైన చెక్కులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంజూరై అందుబాటులోకి వచ్చాయని, వాటిని లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వివరించారు.  నారోగ్యంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వైద్య ఖర్చులు భరించలేక పేద కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. అర్హులైన బాధితులకు అవసరమైన సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.  ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం అందక ఏ కుటుంబమూ ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్య చికిత్స పొందాలని లబ్ధిదారులకు సూచించారు.