ధాన్య లక్ష్మి గా అలంకరించుకున్న శ్రీ కనకమహాలక్ష్మి లడ్డులతో సహస్రనామార్చన సేవలు..!
విశాఖపట్నం, సూర్య : శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా మంగళవారం ధాన్యలక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు పండితులు అమ్మవారికి లడ్డులతో సహస్రనామార్చన సేవలను భక్తిశ్రద్ధలతో జరిపారు. నగరానికి చెందిన మద్దినేని సురేష్ బాబు, మాధవి దంపతులు, శ్రీలక్ష్మి నేటి అలంకరణకు దాతలుగా వ్యవహరించారు. పండితులు ఉభయ దాతలు చేత అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయించారు. అమ్మవారి అలంకరించిన చీరలను సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లక్కీ మాల్ అధినేతలు అందజేశారు. గర్భగుడిలో ధాన్య లక్ష్మీ రూపంలో ఉన్న కనకమహాలక్ష్మి పాదాల ముందు వేల సంఖ్యలో లడ్డులను పరిచి అమ్మవారికి సమర్పించారు. ఉదయం నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బుధవారం నాడు ధైర్య లక్ష్మీ అలంకరణలో లక్ష్మీ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలంకరణ సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించి వేద పండితులు ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకం,జలాభిషేకం, పుష్పాలతో అమ్మవారు అలంకరించి మేళ తాళాలతో ఆలయంలో పూజలు అర్పించారు. సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి గర్భగుడిలో దర్శనం కోసం భక్తులు తెగబడ్డారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.