BREAKING
ఈక్విటీల జోరుతో గోల్డ్‌మన్ శాక్స్ త్రైమాసిక లాభం వృద్ధి భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా!

పోలంపల్లి డ్యామ్‌ వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట.. పెద్దమందవ రైతులకు సాగునీరు అందించేలా చర్యలు అధికారులు, రైతులతో మాట్లాడి మున్నేరు కాలువకు నీటి మళ్లింపు

Select Suryaa Now
పోలంపల్లి డ్యామ్‌ వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట.. పెద్దమందవ రైతులకు సాగునీరు అందించేలా చర్యలు  అధికారులు, రైతులతో మాట్లాడి మున్నేరు కాలువకు నీటి మళ్లింపు

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ఆధారంగా పోలంపల్లి డ్యామ్‌ను నిర్మించారు. ఈ డ్యామ్‌ నీటిపై ఆధారపడి వత్సవాయి మండలంతో పాటు పెనుగంచిప్రోలు మండలంలోని పలువురు రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు.

అయితే ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో డ్యామ్‌లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని తెలంగాణ రాష్ట్రంలోని పెద్దమందవ ప్రాంత రైతులు వినియోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో సాగునీటిని వినియోగించుకునే సమయంలో కొంత నీరు వృథాగా పోతుండటాన్ని గుర్తించిన పోలంపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలారు చిన్ని స్పందించారు. నీటిని వృథా కాకుండా అరికట్టి, దిగువ ప్రాంత రైతులకు కూడా ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో పెద్దమందవ రైతులతో మాట్లాడారు.

సంబంధిత అధికారులతోనూ చర్చించి, వృథాగా బయటకు పోతున్న నీటికి ఇసుక బస్తాలతో తాత్కాలిక అడ్డుకట్ట ఏర్పాటు చేయించారు. అనంతరం ఆ నీటిని డ్యామ్‌ కింద ఉన్న మున్నేరు కాలువలోకి మళ్లించేలా చర్యలు తీసుకున్నారు.

ఈ చర్యలతో మున్నేరు కాలువలో సుమారు మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పోచవరం గ్రామం వరకు ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది.

వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని వృథా కాకుండా వినియోగించుకునేలా చర్యలు చేపట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమకు సాగునీరు అందేలా చొరవ చూపిన కిలారు చిన్ని కి కృతజ్ఞతలు తెలిపారు.

నీటి ప్రతి చుక్కా రైతులకు విలువైనదే అన్నట్లుగా.. వృథాగా పోతున్న నీటిని సాగుకు మళ్లించేందుకు