దసరా ఉత్సవాలకు ద్వారకాతిరుమల వెంకన్న పట్టు వస్త్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో వి. త్రినాథరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బందితో కూడిన బృందం ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఈ సందర్భంగా ద్వారకాతిరుమల బృందానికి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం బృంద సభ్యులు అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు ఆశీర్వచనం అందించి, ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.