విజ్ఞాన్ యూనివర్సిటీ వడ్లమూడి హాకీ జట్టు ఘన విజయం
కారంచేడు, మేజర్‌న్యూస్ :
ఐఐటీ హైదరాబాద్ వేదికగా జరిగిన హాకీ టోర్నమెంట్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీ, వడ్లమూడి జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కోచ్ ధనంజయ్ మార్గదర్శకత్వంలో జట్టు ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీ జట్టు పలు మ్యాచ్‌లలో పోటీపడి ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో బీహెచ్‌ఈఎల్ జట్టుపై 5-1 గోల్స్‌తో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఐఐటీ హైదరాబాద్ జట్టుతో నిర్ణీత సమయంలో 2-2 గోల్స్‌తో సమంగా నిలిచింది. అనంతరం షూటౌట్‌లో 2-1 ఆధిక్యంతో విజయం సాధించింది.
ఈ టోర్నమెంట్‌లో బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామానికి చెందిన రాయపాటి మహేష్ బాబు లెఫ్ట్ మిడిల్ ఫీల్డర్‌గా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కోచ్ ధనంజయ్ శిక్షణలో ఆటగాళ్లు క్రమశిక్షణతో, సమన్వయంతో ఆడి జట్టు విజయానికి కృషి చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వడ్లమూడి విద్యార్థులు క్రీడల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ విజయంతో దగ్గుబాడు గ్రామంలో తండ్రి రాయపాటి వెంకట సుబ్బారావు కు తన కుమారుడు విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాళ్ళూరి అనీల్ కుమార్, సూర్య రిపోర్టర్, కారంచేడు.